Breaking News

Recent Posts Load More

Tuesday 24 December 2013

Is it Political suicide by AAP?



రాజకీయాల్లో మార్పు తీసుకొస్తామని, చెత్తనంతా ఊడ్చిపారేస్తామని, అవినీతిని సమూలంగా నిర్మూలిస్తామంటూ కొత్తగా వచ్చిన 'ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్).. తన రాజకీయ భవిష్యత్తును అంధకారంలో పడేసుకుంది. ఢిల్లీలో ఏ పార్టీనైతే ప్రజలు ఇంటికి పంపించారో.. ఇప్పుడు అదే పార్టీతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధం కావడంతో సామాన్యుడి పార్టీ కాస్తా అసలు సిసలు రాజకీయ పార్టీగా రూపుదిద్దుకున్నట్టయింది. గత 15 ఏళ్ల పాలనలో జరిగిన అవకతవకలపై విచారణ చేయిస్తానంటూ డాంభికాలు పలికిన పార్టీ ఇప్పుడు అదే పార్టీ చేతిలో ఇమిడిపోయింది. తమకు మద్దతిచ్చే పార్టీపై విచారణ జరిపించడమంటే అది ఎలా జరుగుతుంతో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాజకీయాల్లో నూతన అధ్యాయానికి తెరతీస్తామంటూ వచ్చిన ఆప్ కన్వీనర్, ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి అరవింద్ కేజ్రీవాల్ సైతం అధికార పీఠానికి దాసుడైపోవడం నిజంగా విచారకరమైన అంశం.

ఇటీవల ఢిల్లీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఓటర్లు బీజేపీకి మెజార్టీ సీట్లు కట్టబెట్టి, తర్వాతి స్తానంలో ఆప్ ను ఆదరించారు. 15 ఏళ్లుగా అధికారం చలాయించిన కాంగ్రెస్ ను ఇంటికి సాగనంపారు. 70 సీట్లు గల ఢిల్లీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో అధికారం చేపట్టాలంటే 36 సీట్లు కావాలి. అయితే బీజేపీ 31 స్థానాలు గెలిచి పెద్ద పార్టీగా అవతరించగా, 28 సీట్లతో ఆప్ రెండో స్థానంలో నిలిచింది. ఇక కాంగ్రెస్ పార్టీ 8 సీట్లతో సరిపెట్టుకుంది. ఈ పరిస్థితుల్లో సర్కారు ఏర్పాటు చేయాలంటే ఏవో రెండు పార్టీలు కలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ తమకు సరిపడా సీట్లు రానందున సర్కారు ఏర్పాటు చేయలేమని బీజేపీ ప్రకటించింది. ఆప్ కూడా ప్రతిపక్షంలో కూర్చుంటామని పేర్కొంది. మరోవైపు ఆప్ కు మద్దతిచ్చేందుకు కాంగ్రెస్, బీజేపీలు సంసిద్దత వ్యక్తంచేసినా, తాము ఎవరి మద్దతూ తీసుకునే ప్రసక్తే లేదని కేజ్రీవాల్ స్పష్టంచేశారు.

అయితే రెండు వారాలు తిరిగేసరికి సీన్ మారిపోయింది. చేతి వరకు వచ్చిన అవకాశాన్ని ఎందుకు వదులుకోవాలి అనుకున్నారో ఏమో.. కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమని కేజ్రీవాల్  ప్రకటించారు. ఇందుకు ప్రజల అభిప్రాయం అనే ముసుగు తగిలించారు. ఈ అంశంపై నిర్వహించిన ఎస్సెమ్మెస్ పోల్ లో 74 శాతం మంది కాంగ్రెస్ తో కలవాలని కోరుకున్నారని ఆప్ వెల్లడించింది. ఇక్కడే అసలు సిసలు లాజిక్ మిస్ అయ్యారు. వాస్తవానికి ఢిల్లీ ప్రజలు ఆప్ కంటే బీజేపీ వైపే మొగ్గు చూపారు. అందుకే ఆ పార్టీకి 31 సీట్లు వచ్చాయి. ఇక రెండో అవకాశం ఆప్ కు ఇచ్చారు. కాంగ్రెస్ తమకు వద్దని తేల్చిచెప్పారు. కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా ఆ పార్టీకి రాలేదు. ఈ పరిస్థితుల్లో బీజేపీ మద్దతుతో ఆప్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం నైతికం అనిపించుకుంటుంది. కానీ ప్రజలు వద్దన్న పార్టీతో జట్టు కట్టాలని ఆప్ తీసుకున్న నిర్ణయం వెనుక ఆంతర్యమేంటో అర్థం కాని ప్రశ్నలా మిగిలిపోయింది.

ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం వచ్చినా, తాము ప్రతిపక్షంలోనే ఉంటామని కేజ్రీవాల్ ప్రకటించడంతో ఆయన ఒక్కసారిగా హీరో అయిపోయారు. ఇన్నాళ్లకు సరికొత్త రాజకీయ నేత వచ్చాడని దేశవ్యాప్తంగా ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. మీడియా సైతం కేజ్రీవాల్ ను ఆకాశానికెత్తేసింది. అయితే అనూహ్యంగా ఆయన తన నిర్ణయాన్ని మార్చుకోవడం చూస్తే, ఎంతవారలైనా.. అనే  సామెత గుర్తొస్తోంది. అధికారం దగ్గరకొచ్చేసరికి ఎవరైనా ఒక్కటే అనే సత్యం మళ్లీ బోధపడింది. అధికారం కోసం కాంగ్రెస్ తో అంటకాగడానికి సిద్ధమైన కేజ్రీవాల్ తన నిర్ణయాన్ని ఎలా సమర్థించుకుంటారో, ఆయన చర్యను ఢిల్లీ ప్రజలు ఎలా స్వీకరిస్తారో వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో తేలనుంది.

Read More

Sunday 22 December 2013

Death penalty to for maniac that killed 20 women with cyanide


ప్రేమ అని దగ్గరై.. పెళ్లి చేసుకుంటానని వారిని మోసం చేసి.. హఠాత్తుగా వారినే హత్య చేసే ఓ నరహంతకుడికి కోర్టు ఉరిశిక్ష విధించింది. మంగళూరులోని నాలుగో జిల్లా కోర్టు ఈ తీర్పు ప్రకటించింది. ఇతడు దాదాపు 20 మంది మహిళలను ఇలా ప్రేమ, పెళ్లి పేరుతో చంపేశాడు. నేర చరిత్రలోనే ఇది అత్యంత అరుదైన ఘటనగా న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. క్షమించేందుకు ఏ మాత్రం ఆస్కారం లేదన్నారు. విచారణ సమయంలో కోర్టును తప్పుదోవ పట్టించేందుకు యత్నించాడన్నారు.

మంగళూరుకు చెందిన మోహన్ కుమార్ మనస్తత్వ శాస్త్ర ఉపాధ్యాయుడు. అతడు అమాయక మహిళలను గుర్తించి వారికి చేరువయ్యేవాడు. తొలుత ప్రేమను నటించేవాడు. తర్వాత వివాహం చేసుకుని సమయం చూసి ఆమె వద్ద నగలు తీసుకొని సైనైడ్ పెట్టి చంపేసేవాడు. ఇలా ఇప్పటివరకు 20 మంది మహిళలను హతమార్చాడు. దక్షిణ కన్నడ, ఉడుపి జిల్లాల్లో మహిళలు అనుమానాస్పద స్థితిలో మరణించడంపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు మూడేళ్ల కిందట మోహన్ కుమార్ ను బంధించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మూడు కేసుల్లో నేరం రుజువు కావడంతో కోర్టు ఉరిశిక్ష విధించింది. మరో 17 హత్య కేసులు ఇంకా విచారణలో ఉన్నాయి.


Read More

Friday 20 December 2013

I am son of Super star Krishna



నేను సూపర్ స్టార్ క్రిష్ణగారి అబ్బాయిని.. సూపర్ స్టార్, ప్రిన్స్ మహేష్ బాబు చెప్పిన మాట ఇది. ఆయన తాజాగా నటించిన '1' నేనొక్కడినే సినిమా పాటల విడుదల వేడుక గురువారం సాయంత్రం హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో అట్టహాసంగా జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా పలు సినిమా థియేటర్లలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వేలాది మంది అభిమానులు ఈ కార్యక్రమాన్ని వీక్షించడమే కాకుండా, కొంతమంది మహేష్ లక్కీ అభిమానులు ఆయా ప్రాంతాల నుంచే ఒక్కో పాటను లాంఛనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు అభిమానులు అడిగిన ప్రశ్నకు మహేష్ బాబు, దర్శకుడు సుకుమార్, సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్ సమాధానాలు చెప్పారు.
ఈ సినిమాలో 'హూ ఆర్ యూ' అనే ఫాస్ట్ బీట్ తో సాగే పాట ఒకటి ఉంది. ఈ సందర్భంగా ఆ పాటను ఉదహరిస్తూ.. యాంకర్ ఝాన్సీ 'హూ ఆర్ యూ' అని మహేష్ బాబుని సరదాగా అడిగింది. దీనికి ఆయన 'నేను సూపర్ స్టార్ క్రిష్ణగారి అబ్బాయిని' అని తెలివిగా సమాధానం చెప్పారు.
ఈ సినిమాలో మొత్తం ఐదు పాటలున్నాయి. హూ ఆర్ యూ సాంగే చాలా ఫాస్ట్ బీట్ గా ఉండి బాగా ఆకట్టుకునేలా ఉంది. ఇక సుకుమార్ స్పెషల్ మాస్ సాంగ్ కూడా చాలా బాగుంది. ఇక ఈ సినిమా ద్వారా మహేష్ బాబు తనయుడు గౌతమ్ తెరంగేట్రం చేశాడు. ఈ సినిమా ట్రైలర్ ఈనెల 25న విడుదల కానుంది. సినిమా జనవరి 10న థియేటర్లలో సందడి చేయనుంది.
Read More

Thursday 19 December 2013

No entry for Media to ‘1’ Audio launch


సుకుమార్, మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న '1' నేనొక్కడినే ఆడియో వేడుక కార్యక్రమానికి మీడియాను దూరంగా ఉంచారు. ఈ ఆడియో విడుదల వేడుక గురువారం సాయంత్రం హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో జరగనుంది.
ఆడియో విడుదల కార్యక్రమంలో ఓ కొత్త పోకడకు ఈ చిత్ర యూనిట్ శ్రీకారం చుట్టింది. తొలిసారిగా ఆడియో వేడుకను సినిమా థియేటర్లలో లైవ్ ఇవ్వనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని ఎంపిక చేసిన థియేటర్లలో ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. అలాగే టికెట్ విక్రయాలు కూడా జరిగిపోయాయి. టికెట్ తోపాటు టీషర్టు, కీచైన్, స్టిక్కర్లను కాంప్లిమెంటరీగా పంపిణీ చేశారు. ఈ నేపథ్యంలో ఆడియో వేడుక చూడటానికి వచ్చే మహేష్ అభిమానులకు, కార్యక్రమం కవరేజీ హక్కులు పొందిన టీవీ చానల్ తప్ప.. ఇతర మీడియాను లోపలకు రానివ్వరు.
మహేష్ సినిమాకు దేవీశ్రీప్రసాద్ తొలిసారిగా సంగీతం అందించడంతో ఆడియోపై అంచనాలు భారీగానే ఉన్నాయి. పైగా మూడు రోజుల క్రితం విడుదల చేసిన మైక్రో ఆడియోకు మంచి రెస్సాన్స్ వచ్చింది. 25 సెకన్లపాటు ఉన్న ఆ వీడియోలో మహేష్.. రాక్ స్టార్ లా 'హూ ఆర్ యూ' అంటూ ఎంతో ఎనర్జిటిక్ గా పాడిన పాట బాగా అలరించింది.
Read More

Rs.300 Cr loss to Tollywood in 2013



తెలుగు సినీ పరిశ్రమకు 2013 చేదు అనుభవాన్నే మిగిల్చింది. ప్రథమార్థం కాస్త బాగానే ఉన్నప్పటికీ ద్వితీయార్థం మాత్రం ఘోర పరాజయాలను చవిచూసింది. మగధీర రికార్డులు తడిచిపెట్టిన అత్తారింటికి దారేది వంటి భారీ హిట్ వచ్చినప్పటికీ, పలువురు పెద్ద హీరోల సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టడంతో ఈ ఏడాది దాదాపు రూ.300 కోట్ల మేర తెలుగు పరిశ్రమ నష్టపోయింది.
రామ్ చరణ్ కు ఈ ఏడాది మాత్రం పీడకలే. ప్రథమార్థంలో వచ్చిన నాయక్.. హిట్ టాక్ తెచ్చుకుని రూ.40 కోట్లు కొల్లగొట్టినా, ఆ తర్వాత వచ్చిన తుఫాన్ ఘోరమైన ప్లాప్ అయింది. బాలీవుడ్ లో జంజీర్ తో తెరంగాట్రం చేసిన చరణ్ కు అక్కడ చేదు అనుభవమే ఎదురైంది. తొలిరోజునే జంజీర్ ప్లాప్ టాక్ తెచ్చుకోవడంతో సరైన ఓపెనింగ్స్ కూడా రాలేదు. ఇక ఆ సినిమాకు తెలుగు వెర్షన్ గా వచ్చిన తుఫాన్ కు కూడా ఇక్కడ ఆదరణ లభించలేదు. దాదాపు రూ.60 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా.. కనీసం రూ.20 కోట్లు కూడా తెచ్చుకోలేకపోయింది. ఇక సినిమా మొత్తం పూర్తయిన ఎవడు.. విడుదలకు నోచుకోకపోవడం చరణ్ కు మరో దెబ్బ. అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ కు కూడా 2013 కలిసి రాలేదు. పూరీ జగన్నాథ్, బన్నీ కాంబినేషన్ లో రూ.40 కోట్లతో తెరకెక్కిన ఇద్దరమ్మాయిలతో బాక్సాఫీసు వద్ద చతికలపడింది. జూనియర్ ఎన్టీఆర్, శ్రీను వైట్ల కాంబినేషన్లో రూపొందిన బాద్ షా ఆశించిన మేరకు అంచనాలను అందుకోలేకపోయింది. అనంతరం గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కిన రామయ్యా.. వస్తావయ్యా అట్టర్ ప్లాప్ కావడం ఎన్టీఆర్ కు తీరని వ్యధ మిగిల్చింది.
ఇక కెరీర్ చరమాంకంలో ఉన్న వెంకటేష్ పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. మెహర్ రమేష్ దర్శకత్వంలో వచ్చిన షాడో ఎంత దారుణమైన ప్లాప్ అయ్యిందో అందరికీ తెలిసిందే. తర్వాత వచ్చిన మసాలా సినిమా కూడా బోల్తా కొట్టింది. ఇక కల్యాణ్ రామ్ నటించి నిర్మించిన ఓం సినిమా దారుణంగా ప్లాప్ అయ్యింది. గ్రాఫిక్స్ కోసం భారీగానే ఖర్చు చేసినప్పటికీ సరైన కథ, కథనం లేకపోవడంతో ఆ సినిమా ప్లాప్ జాబితాలో చేరిపోయి నిర్మాతకు నష్టాన్నే మిగిల్చింది. ఇక రామ్ ఎందుకంటే ప్రేమంటే, ఒంగోలు గిత్తలు ఘోరంగా ప్లాపయ్యాయి.
Read More
Subscribe
Labels
Popular Posts

Subscribe Via Email

About Us

Advertisment

>
© telugutrendz.com All rights reserved | Designed By Seo Blogger Templates