
హైదరాబాద్: అంతా ఊహించినట్లే.. కాంగ్రెస్ కుదేలవుతోంది. నరేంద్ర మోడీ మానియా రుజువవుతోంది. ఇటీవల ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాలకు నాలుగు రాష్ట్రాల ఫలితాలు ఆదివారం వెలువడ్డాయి. సాయంత్రం 4 గంటల వరకు అందిన ఫలితాలం ప్రకారం.. మూడు రాష్ట్రాల్లో బీజేపీ పూర్తిగాను, ఒక రాష్ట్రంలో అటు ఇటుగాను ముందంజలో ఉంది. మధ్యప్రదేశ్ లో 230 స్థానాలకు బీజేపీ 80 స్థానాల్లో గెలవగా.. మరో 70 స్థానాల్లో ఆధిక్యంలో ఉందిథ. రాజస్థాన్లో 200 స్థానాలకు 119 స్థానాల్లో గెలిచి 30 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఛత్తీస్ గఢ్ లో 90 స్థానాలకు.. 20 స్థానాల్లో గెలిచి 28 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 17 స్థానాల్లో గెలిచి 20 స్థానాల్లో ఆదిక్యంలో ఉంది. ఢిల్లీలో కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని చవిచూస్తోంది. ముఖ్యమంత్రి షీలా దీక్షిత్.. ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రివాల్ చేతిలో ఓడిపోగా.. 90 స్థానాలకు బీజేపీ 17 స్థానాల్లో గెలిచింది. ఆమ్ ఆద్మీ పార్టీ 15 స్థానాల్లో గెలిచింది. రేపు మిజోరం ఫలితాలు వెలువడనున్నాయి.
keywords: 5 states elections results, 4 states election results, aam admi party victory in delhi, chattisgarh election result, delhi election result, rajasthan election result, madhya pradesh election result,
No comments:
Post a Comment