Breaking News
Showing posts with label movies. Show all posts
Showing posts with label movies. Show all posts

Friday, 20 December 2013

I am son of Super star Krishna



నేను సూపర్ స్టార్ క్రిష్ణగారి అబ్బాయిని.. సూపర్ స్టార్, ప్రిన్స్ మహేష్ బాబు చెప్పిన మాట ఇది. ఆయన తాజాగా నటించిన '1' నేనొక్కడినే సినిమా పాటల విడుదల వేడుక గురువారం సాయంత్రం హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో అట్టహాసంగా జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా పలు సినిమా థియేటర్లలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వేలాది మంది అభిమానులు ఈ కార్యక్రమాన్ని వీక్షించడమే కాకుండా, కొంతమంది మహేష్ లక్కీ అభిమానులు ఆయా ప్రాంతాల నుంచే ఒక్కో పాటను లాంఛనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు అభిమానులు అడిగిన ప్రశ్నకు మహేష్ బాబు, దర్శకుడు సుకుమార్, సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్ సమాధానాలు చెప్పారు.
ఈ సినిమాలో 'హూ ఆర్ యూ' అనే ఫాస్ట్ బీట్ తో సాగే పాట ఒకటి ఉంది. ఈ సందర్భంగా ఆ పాటను ఉదహరిస్తూ.. యాంకర్ ఝాన్సీ 'హూ ఆర్ యూ' అని మహేష్ బాబుని సరదాగా అడిగింది. దీనికి ఆయన 'నేను సూపర్ స్టార్ క్రిష్ణగారి అబ్బాయిని' అని తెలివిగా సమాధానం చెప్పారు.
ఈ సినిమాలో మొత్తం ఐదు పాటలున్నాయి. హూ ఆర్ యూ సాంగే చాలా ఫాస్ట్ బీట్ గా ఉండి బాగా ఆకట్టుకునేలా ఉంది. ఇక సుకుమార్ స్పెషల్ మాస్ సాంగ్ కూడా చాలా బాగుంది. ఇక ఈ సినిమా ద్వారా మహేష్ బాబు తనయుడు గౌతమ్ తెరంగేట్రం చేశాడు. ఈ సినిమా ట్రైలర్ ఈనెల 25న విడుదల కానుంది. సినిమా జనవరి 10న థియేటర్లలో సందడి చేయనుంది.
Read More

Thursday, 19 December 2013

No entry for Media to ‘1’ Audio launch


సుకుమార్, మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న '1' నేనొక్కడినే ఆడియో వేడుక కార్యక్రమానికి మీడియాను దూరంగా ఉంచారు. ఈ ఆడియో విడుదల వేడుక గురువారం సాయంత్రం హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో జరగనుంది.
ఆడియో విడుదల కార్యక్రమంలో ఓ కొత్త పోకడకు ఈ చిత్ర యూనిట్ శ్రీకారం చుట్టింది. తొలిసారిగా ఆడియో వేడుకను సినిమా థియేటర్లలో లైవ్ ఇవ్వనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని ఎంపిక చేసిన థియేటర్లలో ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. అలాగే టికెట్ విక్రయాలు కూడా జరిగిపోయాయి. టికెట్ తోపాటు టీషర్టు, కీచైన్, స్టిక్కర్లను కాంప్లిమెంటరీగా పంపిణీ చేశారు. ఈ నేపథ్యంలో ఆడియో వేడుక చూడటానికి వచ్చే మహేష్ అభిమానులకు, కార్యక్రమం కవరేజీ హక్కులు పొందిన టీవీ చానల్ తప్ప.. ఇతర మీడియాను లోపలకు రానివ్వరు.
మహేష్ సినిమాకు దేవీశ్రీప్రసాద్ తొలిసారిగా సంగీతం అందించడంతో ఆడియోపై అంచనాలు భారీగానే ఉన్నాయి. పైగా మూడు రోజుల క్రితం విడుదల చేసిన మైక్రో ఆడియోకు మంచి రెస్సాన్స్ వచ్చింది. 25 సెకన్లపాటు ఉన్న ఆ వీడియోలో మహేష్.. రాక్ స్టార్ లా 'హూ ఆర్ యూ' అంటూ ఎంతో ఎనర్జిటిక్ గా పాడిన పాట బాగా అలరించింది.
Read More

Rs.300 Cr loss to Tollywood in 2013



తెలుగు సినీ పరిశ్రమకు 2013 చేదు అనుభవాన్నే మిగిల్చింది. ప్రథమార్థం కాస్త బాగానే ఉన్నప్పటికీ ద్వితీయార్థం మాత్రం ఘోర పరాజయాలను చవిచూసింది. మగధీర రికార్డులు తడిచిపెట్టిన అత్తారింటికి దారేది వంటి భారీ హిట్ వచ్చినప్పటికీ, పలువురు పెద్ద హీరోల సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టడంతో ఈ ఏడాది దాదాపు రూ.300 కోట్ల మేర తెలుగు పరిశ్రమ నష్టపోయింది.
రామ్ చరణ్ కు ఈ ఏడాది మాత్రం పీడకలే. ప్రథమార్థంలో వచ్చిన నాయక్.. హిట్ టాక్ తెచ్చుకుని రూ.40 కోట్లు కొల్లగొట్టినా, ఆ తర్వాత వచ్చిన తుఫాన్ ఘోరమైన ప్లాప్ అయింది. బాలీవుడ్ లో జంజీర్ తో తెరంగాట్రం చేసిన చరణ్ కు అక్కడ చేదు అనుభవమే ఎదురైంది. తొలిరోజునే జంజీర్ ప్లాప్ టాక్ తెచ్చుకోవడంతో సరైన ఓపెనింగ్స్ కూడా రాలేదు. ఇక ఆ సినిమాకు తెలుగు వెర్షన్ గా వచ్చిన తుఫాన్ కు కూడా ఇక్కడ ఆదరణ లభించలేదు. దాదాపు రూ.60 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా.. కనీసం రూ.20 కోట్లు కూడా తెచ్చుకోలేకపోయింది. ఇక సినిమా మొత్తం పూర్తయిన ఎవడు.. విడుదలకు నోచుకోకపోవడం చరణ్ కు మరో దెబ్బ. అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ కు కూడా 2013 కలిసి రాలేదు. పూరీ జగన్నాథ్, బన్నీ కాంబినేషన్ లో రూ.40 కోట్లతో తెరకెక్కిన ఇద్దరమ్మాయిలతో బాక్సాఫీసు వద్ద చతికలపడింది. జూనియర్ ఎన్టీఆర్, శ్రీను వైట్ల కాంబినేషన్లో రూపొందిన బాద్ షా ఆశించిన మేరకు అంచనాలను అందుకోలేకపోయింది. అనంతరం గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కిన రామయ్యా.. వస్తావయ్యా అట్టర్ ప్లాప్ కావడం ఎన్టీఆర్ కు తీరని వ్యధ మిగిల్చింది.
ఇక కెరీర్ చరమాంకంలో ఉన్న వెంకటేష్ పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. మెహర్ రమేష్ దర్శకత్వంలో వచ్చిన షాడో ఎంత దారుణమైన ప్లాప్ అయ్యిందో అందరికీ తెలిసిందే. తర్వాత వచ్చిన మసాలా సినిమా కూడా బోల్తా కొట్టింది. ఇక కల్యాణ్ రామ్ నటించి నిర్మించిన ఓం సినిమా దారుణంగా ప్లాప్ అయ్యింది. గ్రాఫిక్స్ కోసం భారీగానే ఖర్చు చేసినప్పటికీ సరైన కథ, కథనం లేకపోవడంతో ఆ సినిమా ప్లాప్ జాబితాలో చేరిపోయి నిర్మాతకు నష్టాన్నే మిగిల్చింది. ఇక రామ్ ఎందుకంటే ప్రేమంటే, ఒంగోలు గిత్తలు ఘోరంగా ప్లాపయ్యాయి.
Read More

Wednesday, 18 December 2013

Ram is happy with "Gay"


నరానరాల్లో ఉత్సాహం ఉరకలేసే రామ్ ఏంటి.. ఇలా అంటున్నారేంటి అనుకుంటున్నారా? కంగారుపడకండి.. ఆయన చెప్పింది తన పాత్ర గురించి మాత్రమే. మసాలా సినిమాలో ఆయన గే పాత్రలో కనిపించడం ఆయన అభిమానుల్ని ఆశ్చర్యపరిచింది. నిజంగానే స్వలింగ సంపర్కుడా అన్నట్లు మసాలా సినిమాలో తన పాత్రకు ఆద్యంత రక్తికట్టించింది నిజంగానే రామేనంటూ అభిమానులు నమ్మేటట్టుకూడా లేరు.

దీనిపై రామ్ ను ప్రశ్నిస్తే.. అలాంటి పాత్ర తాను చేస్తానని అస్సలు అనుకోనే లేదని, అయితే సినిమా డిమాండ్ చేసింది కాబట్టి చేశానని, తన శాయశక్తులా పాత్రకు న్యాయం చేశానని అన్నారు.
Read More

Tuesday, 17 December 2013

Is Atiloka sundari come back to Tollywood?



బాలీవుడ్ నటి శ్రీదేవి మళ్లీ తెలుగుతెరపై కనిపించబోతున్నారా? తన అభిమానులను మళ్లీ అలరించబోతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇటీవల ఇంగ్లిష్ వింగ్లిష్ సినిమాలో కనువిందు చేసిన అతిలోక సుందరి తిరిగి తెలుగు సినిమాల్లో నటించే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం శ్రీదేవి పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిందనే కథనాలు గట్టిగా వినిపిస్తున్నాయి. సహారా గ్రూప్ కు భారీ మొత్తంలో బకాయిపడ్డట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో అప్పుల ఊబి నుంచి గట్టెక్కేందుకు ఇకపై పూర్తిస్థాయిలో సినిమాలపైనే పనిచేయాలని శ్రీదేవి నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఇందులో భాగంగా తనకు విడదీయరాని అనుబంధం ఉన్న టాలీవుడ్ వైపు ఆమె చూస్తోందని తెలిసింది. తన కుమార్తెను హీరోయిన్ గా పరిచయం చేయాలని ఇన్నాళ్లూ భావించిన శ్రీదేవి.. తాజాగా ఆ ఆలోచనను పక్కనపెట్టి, తానే స్వయంగా రంగంలోకి దిగాలని యోచిస్తున్నారు. తెలుగు ప్రేక్షకుల్లో ఆమెకు ఇప్పటికీ అభిమానులు ఉండటం శ్రీదేవికి కలిసొచ్చే అంశం. అంతా అనుకున్నట్టు జరిగితే త్వరలోనే అతిలోక సుందరిని ఏ అత్త పాత్రలోనూ చూడటం తథ్యం.
Read More

Thursday, 12 December 2013

Another gossip on Pawan Kalyan



పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై మరో గాసిప్ గుప్పుమంది. ఆయన రాజకీయాల్లోకి వస్తున్నారంటూ గత కొంత కాలంగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై పవన్ ఎప్పుడూ పెదవి విప్పలేదు. ఓ దశలో పవన్, ఆయన సోదరుడు నాగబాబు తెలుగుదేశం పార్టీలోకి వెళ్తున్నారని జోరుగా ప్రచారం సాగింది. ఎప్పటిలాగే దీనిపై పవన్ స్పందించకపోవడంతో ఆయన అభిమానుల్లో గందరగోళం చోటుచేసుకుంది. దీంతో తాము ఏ పార్టీలోనూ చేరడంలేదని నాగబాబు పత్రికా ప్రకటన విడుదల చేయడంతో ఆ వదంతులకు పుల్ స్టాప్ పడింది. అయితే తాజాగా మరోసారి పవన్ రాజకీయ ప్రవేశంపై వదంతులు షికార్లు చేస్తున్నాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సంచలన ఫలితాలు సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీలో పవన్ చేరతాడని, ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ ఇన్ చార్జిగా పవర్ స్టార్ ఉంటాడని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయ్. సమాజానికి ఏదో చేయాలనే తపన ఉన్న పవన్.. ఆచరణలో మాత్రం ముందుకెళ్లలేకపోతున్నాడు. తెర వెనుక చేతనైన సాయం చేయడం తప్ప.. చేసిన సాయానికి ప్రచారం కూడా ఇష్టపడని పవన్ కళ్యాణ్.. అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతూ రాజకీయాల్లోకి వచ్చిన కేజ్రీవాల్ తో కలిస్తే చాలా బాగుంటుందని పలువురు విశ్లేషిస్తున్నారు. మరి పవన్ ఆమ్ ఆద్మీ పార్టీలో చేరతాడా లేదా అనేది కాలమే నిర్ణయిస్తుంది.
Read More

Sunday, 8 December 2013

Actor Dharmavarapu no more



ప్రముఖ హాస్యనటుడు ధర్మవరపు సుబ్రమణ్యం(53) ఇక లేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం రాత్రి 10.30 గంటల సమయంలో దిల్ సుఖ్ నగర్ లోని ఆయన ఇంట్లో కన్నుమూశారు. దూరదర్శన్ లో ప్రసారమైన ఆనందో బ్రహ్మ సీరియల్ తో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ధర్మవరపు.. బావాబావా పన్నీరు సినిమా ద్వారా వెండితెరకు పరిచమయ్యారు. వందలాది సినిమాల్లో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు. తోకలేనిపిట్ల అనే సినిమాకు దర్శకత్వం కూడా వహించారు. ప్రకాశం జిల్లా కొమ్మనేనివారి పాలెంలో జన్మించిన ధర్మవరపు సుబ్రమణ్యం.. తెలుగు సీనిపరిశ్రమలో తనకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్ సాంస్క`తిక మండలి చైర్మన్ గా కూడా పనిచేశారు. ధర్మవరపు ఆకస్మిక మరణంతో సినీపరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. పలువురు ప్రముఖులు ఆయన మరణం పట్ల సంతాపం ప్రకటించారు.
Tags: Actor Dharmavarapu died, Dharmavarapu Subramanyam news, Dharmavarapu photos, Dharmavarapu comedy
Read More

Thursday, 5 December 2013

Times best actor Pawan

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఖాతాలో మరో ఘనత చేరింది. పవనిజంతో అభిమానులను ఉర్రూతలూగిస్తున్న పవన్.. ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. హైదరాబాద్ టైమ్స్ 2012 ఫిల్మ్ అవార్డుల్లో పవన్ కి ఈ అవార్డు లభించింది. గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ నటనకు ఈ పురస్కారం దక్కింది. ఇక ఇష్క్ సినిమా హీరోయిన్ నిత్యామీనన్ ఉత్తమ నటిగా ఎంపికైంది. ఈగ సినిమాను అద్భుతంగా మలిచిన రాజమౌళికి ఉత్తమ దర్శకుడి అవార్డు వరించింది.
హైదరాబాద్ టైమ్స్ 2012 ఫిల్మ్ అవార్డుల విజేతలు వీరే...
పవన్ కల్యాణ్ (ఉత్తమ నటుడు)
నిత్యామీనన్ (ఉత్తమ నటి)
ఈగ (ఉత్తమ చిత్రం)
రాజమౌళి (ఉత్తమ దర్శకుడు, ఈగ)
ఉత్తమ సంగీత దర్శకుడు (దేవీశ్రీప్రసాద్, గబ్బర్ సింగ్)
ఉత్తమ పాటల రచయిత (సిరివెన్నెల సీతారామశాస్త్రి, క`ష్ణం వందే జగద్గురుం)
ఉత్తమ నేపథ్య గాయకుడు (దీపు, నేనే నానీనే.. ఈగ)
ఉత్తమ నేపథ్య గాయని (సుచిత్ర, సారొత్తారొత్తారు.. బిజినెస్ మాన్)
Read More

Wednesday, 4 December 2013

Mahesh “1” audio release live in theaters


విడుదలకు ముందే ఉత్కంఠ రేపుతున్న మహేష్ బాబు '1' నేనొక్కడినే సినిమా ఆడియో వేడుకను వినూత్నంగా జరపనున్నారు. మహేష్ బాబు, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది. జనవరి 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే అంతకుముందు జరిగే ఆడియో వేడుకను వినూత్నంగా చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయించింది. 

 ఇప్పటివరకు ఆడియో ఫంక్షన్లు టీవీ చానళ్లలో మాత్రమే లైవ్ వచ్చేవి. అయితే 'వన్' ఆడియో వేడుకను ప్రత్యక్ష ప్రసారం ద్వారా సినిమా థియేటర్లలో ప్రదర్శించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఈనెల 19న హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో ఆడియో వేడుక జరగనుంది. ఈ కార్యక్రమాన్ని టీవీ చానళ్లతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన థియేటర్లలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చు. ఇందుకు నామమాత్రంగా కొంత రుసుం వసూలు చేసే అవకాశం ఉంది. 

అయితే రుసుం వసూలు చేయాలా వద్దా అనే దానిపై ఇంకా స్పష్టత లేకున్నప్పటికీ, కనీసం చార్జీలు వసూలు చేస్తారని సమాచారం. దేవీశ్రీప్రసాద్ సంగీతం సమకూర్చిన పాటలు చాలా బాగా వచ్చాయని ఇండస్ట్రీ టాక్. తొలిసారిగా మహేష్ బాబు సినిమాకు సంగీతం అందిస్తున్న దేవి.. దీనిపై ఫుల్ ఎఫర్ట్స్ పెట్టినట్టు చెబుతున్నారు. పైగా ఈ సినిమాలో మహేష్ బాబు పాప్ స్టార్ కావడంతో హాలీవుడ్ రేంజ్ లో సంగీతం ఇచ్చినట్టు తెలిసింది. మరో 15 రోజుల్లో వన్ పాటలు ఒక ఊపు ఊపడం ఖాయమని పరిశ్రమ వర్గాలు ధీమా వ్యక్తంచేస్తున్నాయి.
Read More
Subscribe
Labels
Popular Posts

Subscribe Via Email

About Us

Advertisment

>
© telugutrendz.com All rights reserved | Designed By Seo Blogger Templates