
సుకుమార్, మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న '1' నేనొక్కడినే ఆడియో వేడుక కార్యక్రమానికి మీడియాను దూరంగా ఉంచారు. ఈ ఆడియో విడుదల వేడుక గురువారం సాయంత్రం హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో జరగనుంది.
ఆడియో విడుదల కార్యక్రమంలో ఓ కొత్త పోకడకు ఈ చిత్ర యూనిట్ శ్రీకారం చుట్టింది. తొలిసారిగా ఆడియో వేడుకను సినిమా థియేటర్లలో లైవ్ ఇవ్వనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని ఎంపిక చేసిన థియేటర్లలో ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. అలాగే టికెట్ విక్రయాలు కూడా జరిగిపోయాయి. టికెట్ తోపాటు టీషర్టు, కీచైన్, స్టిక్కర్లను కాంప్లిమెంటరీగా పంపిణీ చేశారు. ఈ నేపథ్యంలో ఆడియో వేడుక చూడటానికి వచ్చే మహేష్ అభిమానులకు, కార్యక్రమం కవరేజీ హక్కులు పొందిన టీవీ చానల్ తప్ప.. ఇతర మీడియాను లోపలకు రానివ్వరు.
మహేష్ సినిమాకు దేవీశ్రీప్రసాద్ తొలిసారిగా సంగీతం అందించడంతో ఆడియోపై అంచనాలు భారీగానే ఉన్నాయి. పైగా మూడు రోజుల క్రితం విడుదల చేసిన మైక్రో ఆడియోకు మంచి రెస్సాన్స్ వచ్చింది. 25 సెకన్లపాటు ఉన్న ఆ వీడియోలో మహేష్.. రాక్ స్టార్ లా 'హూ ఆర్ యూ' అంటూ ఎంతో ఎనర్జిటిక్ గా పాడిన పాట బాగా అలరించింది.
No comments:
Post a Comment