
నేను సూపర్ స్టార్ క్రిష్ణగారి అబ్బాయిని.. సూపర్ స్టార్, ప్రిన్స్ మహేష్ బాబు చెప్పిన మాట ఇది. ఆయన తాజాగా నటించిన '1' నేనొక్కడినే సినిమా పాటల విడుదల వేడుక గురువారం సాయంత్రం హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో అట్టహాసంగా జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా పలు సినిమా థియేటర్లలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వేలాది మంది అభిమానులు ఈ కార్యక్రమాన్ని వీక్షించడమే కాకుండా, కొంతమంది మహేష్ లక్కీ అభిమానులు ఆయా ప్రాంతాల నుంచే ఒక్కో పాటను లాంఛనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు అభిమానులు అడిగిన ప్రశ్నకు మహేష్ బాబు, దర్శకుడు సుకుమార్, సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్ సమాధానాలు చెప్పారు.
ఈ సినిమాలో 'హూ ఆర్ యూ' అనే ఫాస్ట్ బీట్ తో సాగే పాట ఒకటి ఉంది. ఈ సందర్భంగా ఆ పాటను ఉదహరిస్తూ.. యాంకర్ ఝాన్సీ 'హూ ఆర్ యూ' అని మహేష్ బాబుని సరదాగా అడిగింది. దీనికి ఆయన 'నేను సూపర్ స్టార్ క్రిష్ణగారి అబ్బాయిని' అని తెలివిగా సమాధానం చెప్పారు.
ఈ సినిమాలో మొత్తం ఐదు పాటలున్నాయి. హూ ఆర్ యూ సాంగే చాలా ఫాస్ట్ బీట్ గా ఉండి బాగా ఆకట్టుకునేలా ఉంది. ఇక సుకుమార్ స్పెషల్ మాస్ సాంగ్ కూడా చాలా బాగుంది. ఇక ఈ సినిమా ద్వారా మహేష్ బాబు తనయుడు గౌతమ్ తెరంగేట్రం చేశాడు. ఈ సినిమా ట్రైలర్ ఈనెల 25న విడుదల కానుంది. సినిమా జనవరి 10న థియేటర్లలో సందడి చేయనుంది.
No comments:
Post a Comment