Breaking News


Wednesday 11 December 2013

Congress ready to take action against 6 MPs


యూపీఏ సర్కారుపై అవిశ్వాసం ప్రకటించిన ఆరుగురు సీమాంధ్ర కాంగ్రెస్ కాంగ్రెస్ ఎంపీలపై వేటుకు రంగం సిద్ధమైంది. తొలుత వారి వ్యవహారాన్ని కాస్త లైట్ తీసుకున్న అధిష్టానం.. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే అసలుకే ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నట్టు కనిపిస్తోంది. అందుకే వారి అవిశ్వాసం ఊహించిందేనని, కచ్చితంగా తాము అధిగమిస్తామని డాంభికాలు పలికిన కాంగ్రెస్ పెద్దల స్వరంలో మార్పు వచ్చింది. తొలుత ఆరుగురు ఎంపీలతో ప్రారంభమైన అవిశ్వాస ప్రక్రియకు టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ లు జత కలవడంతో ఆ సంఖ్య 13కి చేరింది. అనంతరం బీజేడీ కూడా అవిశ్వాసానికి సై అనడంతో కాంగ్రెస్ లో కంగారు మొదలైంది. మొత్తానికి అవిశ్వాసంపై చర్చ మొదలుకావడానికి అవసరమైన 50 మంది ఎంపీల మద్దతునూ సీమాంధ్ర ఎంపీలు సాధించడంతో కాంగ్రెస్ పెద్దల్లో ఒక్కాసారిగా వణుకు మొదలైంది. అసలే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కు వ్యతిరేక పవనాలు వీస్తున్న నేపథ్యంలో అందివచ్చిన అవకాశాన్ని వదులుకోవడానికి ఏ పార్టీ సిద్ధంగా ఉండదు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే లాభపడే అవకాశం ఉందనుకున్న ప్రతి పార్టీ అవిశ్వాసానికి అనుకూలంగా ఓటేస్తే.. యూపీఏ పని అంతే. అందుకే వెంటనే రంగంలోకి దిగిన కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు.. ఆ ఆరుగురు సీమాంధ్ర ఎంపీలపై వేటుకు రంగం సిద్ధం చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే అభియోగాలపై వారిని సస్పెండ్ చేయనున్నారు. కాంగ్రెసా? మజాకా?
Share This
Blogger
Facebook
Disqus

comments powered by Disqus

No comments:

Post a Comment

Subscribe
Labels
Popular Posts

Subscribe Via Email

About Us

Advertisment

>
© telugutrendz.com All rights reserved | Designed By Seo Blogger Templates