Breaking News


Wednesday 18 December 2013

Lokpall Bill passed in Lok Sabha also..

లోక్ పాల్ కు లోక్ సభ ఆమోదం..
anna-hazare

న్యూఢిల్లీ: అన్నా హజారేలాంటి ఎందరో సామాజిక సేవా కార్యకర్తల కల ఫలించింది. హజారే దీక్ష ఫలితమో.. ఢిల్లీలో కేజ్రివాల్ విజయదుంధుభి ఎఫెక్టో.. వాటి కారణంగా వచ్చే ఎన్నికల మీద కలిగిన భయమోకాని.. యూపీఏ ప్రభుత్వం ఎట్టకేలకు లోక్ పాల్ బిల్లు ఆమోదానికి నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు మంగళవారం ఈ బిల్లు కు రాజ్యసభ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. అయితే ఈ బిల్లుకు ఈ మధ్యలో కొన్ని సవరణలు సూచించిన నేపథ్యంలో ఆ సవరణలను లోక్ సభ మళ్లీ ఆమోదించాల్సి వచ్చింది.

బుధవారం ఓ వైపు సమైక్యాంధ్ర నినాదాలతో సభ దద్దరిల్లుతుండగా, సమాజ్ వాదీ, శివసేన పార్టీలు తీవ్రంగా బిల్లును వ్యతిరేకిస్తుండగానే.. సభ బిల్లును ఆమోదించింది. బిల్లుకు సహకరించిన పార్టీలందరికీ అన్నా హజారే ధన్యవాదాలు తెలిపి.. దీక్ష విరమణకు సిద్ధమయ్యారు. బిల్లుకు చేసిన సవరణల కారణంగా.. అది జోక్ పాల్ గా తయారైందంటున్న కేజ్రివాల్ ఇప్పుడు ఏమంటారో చూడాలి మరి.
ఇదీ చదవండి: బీజేపీ ఎందుకిలా అంటోంది??

Share This
Blogger
Facebook
Disqus

comments powered by Disqus

No comments:

Post a Comment

Subscribe
Labels
Popular Posts

Subscribe Via Email

About Us

Advertisment

>
© telugutrendz.com All rights reserved | Designed By Seo Blogger Templates