విడుదలకు ముందే ఉత్కంఠ రేపుతున్న మహేష్ బాబు '1' నేనొక్కడినే సినిమా ఆడియో వేడుకను వినూత్నంగా జరపనున్నారు. మహేష్ బాబు, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది. జనవరి 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే అంతకుముందు జరిగే ఆడియో వేడుకను వినూత్నంగా చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయించింది.
ఇప్పటివరకు ఆడియో ఫంక్షన్లు టీవీ చానళ్లలో మాత్రమే లైవ్ వచ్చేవి. అయితే 'వన్' ఆడియో వేడుకను ప్రత్యక్ష ప్రసారం ద్వారా సినిమా థియేటర్లలో ప్రదర్శించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఈనెల 19న హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో ఆడియో వేడుక జరగనుంది. ఈ కార్యక్రమాన్ని టీవీ చానళ్లతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన థియేటర్లలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చు. ఇందుకు నామమాత్రంగా కొంత రుసుం వసూలు చేసే అవకాశం ఉంది.
అయితే రుసుం వసూలు చేయాలా వద్దా అనే దానిపై ఇంకా స్పష్టత లేకున్నప్పటికీ, కనీసం చార్జీలు వసూలు చేస్తారని సమాచారం. దేవీశ్రీప్రసాద్ సంగీతం సమకూర్చిన పాటలు చాలా బాగా వచ్చాయని ఇండస్ట్రీ టాక్. తొలిసారిగా మహేష్ బాబు సినిమాకు సంగీతం అందిస్తున్న దేవి.. దీనిపై ఫుల్ ఎఫర్ట్స్ పెట్టినట్టు చెబుతున్నారు. పైగా ఈ సినిమాలో మహేష్ బాబు పాప్ స్టార్ కావడంతో హాలీవుడ్ రేంజ్ లో సంగీతం ఇచ్చినట్టు తెలిసింది. మరో 15 రోజుల్లో వన్ పాటలు ఒక ఊపు ఊపడం ఖాయమని పరిశ్రమ వర్గాలు ధీమా వ్యక్తంచేస్తున్నాయి.
No comments:
Post a Comment