Breaking News


Sunday 8 December 2013

No use with common capital: JC


హైదరాబాద్ ను ఉమ్మడి రాజధాని చేయడం వల్ల సీమాంధ్రులకు ఎలాంటి ప్రయోజనం ఉండదని మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ బిల్లును అసెంబ్లీలో అడ్డుకోవడం వల్ల కూడా ఒరిగేదేమి ఏమీ ఉండదని సెలవిచ్చారు. సీమాంధ్ర ఎమ్మెల్యేలు అసెంబ్లీలో తెలంగాణ బిల్లును అడ్డుకోవడం సాధ్యమయ్యే పని కాదని తాను భావిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్ర విభజనను ఆపడం ఎవరి తరమూ కాదని, ఎట్టి పరిస్థితుల్లోనూ విభజన జరడం ఖాయమని, సీమాంధ్ర నేతలు కూడా ఇందుకు సన్నద్ధం కావాలని సూచించారు. హైదరాబాద్ లో ఉండే సీమాంధ్రులు అద్దె ఇంట్లో ఉన్నట్టేనని కేంద్రం కూడా వ్యాఖ్యానించిన నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా వారు తమ రాజధాని ఏర్పాటు చేసుకోవడం ఉత్తమమని స్పష్టంచేశారు. సీమాంధ్ర నేతలు కూడా ఇందుకు సన్నద్ధమై తమ రాజధానిని ఏడాదిలోగా నిర్మించుకోవాలని సూచించారు. తాను వైఎస్సార్ సీపీలోకి లేదా తెలుగుదేశం పార్టీలోకి వెళ్లబోనని, అసలు వచ్చే ఎన్నికల్లో పోటీ కూడా చేయనని చెప్పారు.
Tags: jc divakar reddy recent comments, samaikyandhra agiatations, andhra pradesh bifurcation
Share This
Blogger
Facebook
Disqus

comments powered by Disqus

No comments:

Post a Comment

Subscribe
Labels
Popular Posts

Subscribe Via Email

About Us

Advertisment

>
© telugutrendz.com All rights reserved | Designed By Seo Blogger Templates